వరలక్ష్మి అమ్మవారి పూజకు కావలసిన సామగ్రి :-
పసుపు.......100 grms
కుంకుమ......100 grms
గంధం......1box
విడిపూలు.....1/2 kg
పూల మాలలు
తమలపాకులు.......30
30 వక్కలు
ఖర్జూరాలు......50 grms
అగరవత్తులు
కర్పూరం
చిల్లర పైసలు.....Rs. 30/- ( 1Rs coins )
తెల్లని వస్ర్తం
ఎర్రటి రవిక వస్త్రం
బ్లౌస్ పీసులు .............. 2
మామిడి ఆకులు
ఐదు రకాల పండ్లు
అమ్మవారి ఫోటో
కలశం
కొబ్బరి కాయలు... 3
తెల్ల దారం..........లేదా నోము దారం ....2
లేదా పసుపు రాసిన కంకణం
ఇంటిలో తయారుచేసిన నైవేధ్యాలు
బియ్యం, పంచామృతాలు/లేదా పాలు 100 ML......దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి.
వ్రత విధానం :-ఇంట్లోని పూజా గదిలో ఒక మండపాన్ని (ఎత్తు ఐన పీట) ఏర్పాటుచేసుకోవాలి దీని ముందర ఒక చిన్న పీఠ అమర్చుకోవాలి. ఎత్తు ఐన పీట మీద బియ్యపు పిండితో ముగ్గువేసి దాని ఫై బియ్యం పోసి, దాని ఫై అరటి ఆకు అమర్చి దాని ఫై బియ్యం పోసి కలశం ఏర్పాటుచేసుకోవాలి. కలశాన్ని పూవులతో అలంకరించుకోవాలి. చిన్న పీఠ మీద ముగ్గు వేసి రవిక గుడ్డ పెట్టి దాని తమలపాకు అమర్చి దాని ఫై పసుపు గణపతి ని పెట్టి పూవులు తో అలంకరించు కోవాలి. అమ్మవారి ఫొటో లేదా రూపును తయారుచేసి అమర్చు కోవాలి. పూజాసామగ్రి, తోరం, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి.
తోరం తయారు చేసుకోవడం:- తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలను తయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.
గణపతి పూజ:- పసుపు గణపతి కి పూజ చేసుకొవాలి......
ఓం శ్రి గురుబ్యోన్నమః మహాగణాధిపతయే నమః .......మహా సరస్వతాయే నమః
హరిహిఓమ్ ఎవాంచ మజనయంత దే వస్తాం విశ్వరూపా. పశవోవదంతి ! సానోమంద్రేష మూరజం దుహానా ధేనుసర్వగస్మా నుపసుష్టుతైతు అయం ముహూర్త సుముహూర్తోస్తు !! యశ్శివో నామరూపాభ్యాం యదేవి సర్వమంగళా! తయెాః సంస్మరణానిత్యం సర్వదా జయమంగళం !!
హరిహిఓమ్ ఎవాంచ మజనయంత దే వస్తాం విశ్వరూపా. పశవోవదంతి ! సానోమంద్రేష మూరజం దుహానా ధేనుసర్వగస్మా నుపసుష్టుతైతు అయం ముహూర్త సుముహూర్తోస్తు !! యశ్శివో నామరూపాభ్యాం యదేవి సర్వమంగళా! తయెాః సంస్మరణానిత్యం సర్వదా జయమంగళం !!
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.
ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం ।
తదేవ విద్యబలం దైవబలం తదేవ లక్ష్మి పతే తేంఘ్రియుగం స్మరామి ॥
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా॥
ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణికాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గణాధిపాయ నమః
ఓం ధూమకేతవే నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం స్కందపూర్వజాయనమః
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళ పత్రపుష్పాక్షతాన్ సమర్పయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
స్వామివారి ముందు పళ్ళు గాని బెల్లం గానీ నైవేద్యంగా పెట్టాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం ఆచమనీయం సమర్పయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి!
అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు!
మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!
వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.
ఆచమనం: పంచపాత్రలోని నీటిని ఉద్ధరణితో తీసుకుని కేశవనామాలు జపిస్తూ మూడుసార్లు ఆచమనం (చేతిలో ఉద్ధరణితో నీటిని కుడి అరచేతిలో పోసుకొని చప్పుడుకాకుండా తాగాలి) చేయాలి.
(మొదటి సారి) ఓం కేశవాయ స్వాహా, (రెండవ సారి)ఓం నారాయణ స్వాహా, (మూడవ సారి) ఓం మాధవాయ స్వాహా,
(అనంతరం చేతిని శుద్ధి చేసుకోవాలి.)
ఓం గోవిందాయనమః (అంటూ.... ఉద్ధరణితో అరచేతిలోకి నీటిని తీసుకుని కిందకు వదలాలి)
కేశవనామాలు
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్దాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నరసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం జనార్దనాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీ కృష్ణాయ నమః
శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
భూతోచ్ఛాటనం...
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
అని చెప్తూ అన్ని దిక్కులవైపూ కొద్దికొద్దిగా నీళ్లు చల్లాలి.
ప్రాణాయామం :-ఆ తర్వాత ప్రాణాయామం (బొటన వేలితో ముక్కు కుడి వైపు రంధ్రాన్ని మూసి ఎడమ వైపు రంధ్రం గుండా గాలిని పీల్చి కొద్దిసేపటి తరువాత ఎడమ వైపు రంధ్రాన్ని వేలితో మూసి కుడివైపు రంధ్రం గుండా గాలిని బయటకు వదలాలి)
ఓం భూః, ఓం భువః, ఓగ్ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ం సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధియోయోనః ప్రచోదయాత్.. ఓ మాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భవస్సువరోం
సంకల్పం:
ఓం మాపోజ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం , మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్దే, శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే, కృష్ణా, గోదావర్యో మధ్యదేశే, స్వగృహే (సొంత ఇల్లు కానప్పుడు ‘‘వసతిగృహే’’ అనుకోవాలి) సమస్త దేవతా హరిహర సన్నిథౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్ర మానేన శ్రీ శుభకృత్ నామ సంవస్త్రే , దక్షిణాయనే, వర్షరుతౌ, శ్రావణ మాసే, శుక్లపక్షే, ............... తిథౌ(morning ఏ తిథి start అయితే ఆ తిథే చదువుకోవాలి), భార్గవ వాసరే (శుక్రవారం), శుభనక్షత్రే, శుభ యోగే, శుభకరణే, ఏవంగుణ విశేణ విశిష్టాయం శుభ తిథౌ మమ... శ్రీమాన్...... గోత్రోద్భవస్య (ఇక్కడ మీ గోత్రం చెప్పుకోవాలి) నామధేయస్య (ఇంటి యజమాని పేరు) ధర్మపత్నీ సమేతాయం (ఇంటి యజమానురాలి పేరు) సహకుటుంబానాం, క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం, అష్ట ఐశ్వర్యాది యోగ్యతా ఫలసిద్ధ్యర్థ్యం, ధన కనక వస్తు వాహనాభివృద్ధ్యర్థ్యం సర్వదేవతా ప్రసాద సిద్ధ్యర్థ్యం శ్రీ వరసిద్ధి వినాయక ప్రేరణ్యా శ్రీ వరసిద్ధి వినాయక ప్రీత్యర్థ్యం ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి... ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓం వ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహా గుడ సహిత ఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ( అని చదువుతూ నీళ్ళనువదలాలి ).
కలశపూజ:-
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః ।
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాశ్రిత ॥
కుక్షౌతు సాగరాః స్సర్వే సప్త ద్వీపా వసుంధరా |
ఋగ్వేదో థ యజుర్వేదో స్సామవేదో హ్యధర్వణః ॥
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః |
ఆయాంతు గణపతి పూజార్థం సకల దురిత క్షయ కారకాః ॥
గంగేచ యమునేచైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ॥
కావేరి తుంగభద్ర చ కృష్ణవేణి చ గౌతమి భగీరథీ చ విఖ్యాతాః పంచ్ గంగాః ప్రకీర్తితాః ॥
అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపై, పూజాద్రవ్యాలపై, పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.
ఓం ఓం ఓం కలశోదకేన పూజ ద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవం సంప్రోక్ష్య, ఆత్మాసం చ సంప్రోక్ష్య
అధాంగపూజ:- పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.
ఓం చంచలాయై నమః - పాదౌ పూజయామి
ఓం చపలాయై నమః - జానునీ పూజయామి
ఓం పీతాంబరాయైనమః - ఉరుం పూజయామి
ఓం కమల వాసిన్యైనమః - కటిం పూజయామి
ఓం పద్మాలయాయైనమః -నాభిం పూజయామి
ఓం మదనమాత్రేనమః - స్తనౌ పూజయామి
ఓం లలితాయై నమః - భుజద్వయం పూజయామి
ఓం కంబుకంఠ్యై నమః -కంఠంపూజయామి
ఓం సునాసికాయై నమః - నాసికాం పూజయామి
ఓం శ్రియై నమః - ఓష్ఠ పూజయామి
ఓం సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి
ఓం రమాయైనమః - కర్ణౌ పూజయామి
ఓం సుముఖాయై నమః– ముఖంపూజయామి
ఓం సుశీర్షాయై నమః - శిరః పూజయామి
శ్రీ వరలక్ష్మియై నమః - సర్వాణ్యంగాని పూజయామి.
(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)
శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి:-
ఓం ప్రకృత్యై నమః
ఓం కృతై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః (10)
ఓం పద్మాయై నమః
ఓం శుచయే నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః (20)
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః (30)
ఓం బుద్ధ్యై నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖియై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః (50)
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః (60)
ఓం చంద్ర రూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః (70)
ఓం తుష్టయే నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతి పుష్కరిణ్యైనమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః (80)
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం స్త్రైణ సౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మ గతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః (90)
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః (100)
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః (108)
ఇతి శ్రీలక్ష్మ్యష్టోత్తరశతనామావళిః సమాప్తాః ।
తోరపూజ :- తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ విధంగా పూజ చేయాలి.
కమలాయైనమః ప్రథమగ్రంథిం పూజయామి
రమాయైనమః ద్వితీయ గ్రంథిం పూజయామి
లోకమాత్రేనమః తృతీయ గ్రంథింపూజయామి
విశ్వజనన్యైనమః చతుర్థ గ్రంథిం పూజయామి
మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి
క్షీరాబ్ది తనయాయై నమః షష్ఠమ గ్రంథిం పూజయామి
విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి
చంద్రసోదర్యైనమః అష్టమగ్రంథిం పూజయామి
శ్రీ వరలక్ష్మీయై నమః నవమగ్రంథిం పూజయామి
ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే
వాయన దానం :వాయనం ఇస్తున్నప్పుడు ఈ శ్లోకాన్ని చదువుతూ వాయనం ఇవ్వాలి
వాయనం అంటే : ముత్తైదవులకు పసుపు, కుంకుమ, జాకెట్టు గుడ్డ, దక్షిణ, పళ్ళు, పుస్తకం, పళ్లెంలో పెట్టి దానం ఇవ్వాలి.
శ్లో : ఇందిరా ప్రతిగృహ్యాతు ఇందిరా వై దదాతి చ ।
ఇందిరా తరకోభభ్యాం ఇందిరాయై నమోనమః ॥
ఈ శ్లోకంతో వాయనం ఇచ్చి అక్షతలు తీసుకొని వ్రత కథను చదవాలి
పురాణ గాధ ఏమిటి :- స్కందపురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరిస్తారు. అదే సందర్భంలో పరమేశ్వరుడు గిరిజకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియచేస్తారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ వారి ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరిచారని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని పెద్దల మాట.
వరలక్ష్మీ వ్రత కథ:- పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహార్షి ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమ శివుడు పార్వతి దేవి కి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి అన్నారు.
పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయను కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి ప్రాణేశ్వరా! స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపారు.
అప్పుడు పార్వతీదేవి...దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. కాత్యాయనీ...!పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక పుణ్య స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతఃకాల గృహకృత్యాలను పూర్తిచేసుకుని అత్త,మామలను సేవలు చేస్తూ తరించేంది.
వరలక్ష్మీ అమ్మవారి సాక్షాత్కారం:- వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ...ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు... నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. హే జననీ! నీకృపా కటాక్షాలు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది' అని పరిపరివిధాల వరలక్ష్మీ అమ్మవారి ని స్తుతించింది.
అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు.
శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే ! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.
అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి, భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేసారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లుఘల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణభూషితులయ్యారు.
వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజతురగరథ వాహనాలతో వచ్చి ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గ మధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలుకలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు.
ఓ మునులారా... శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథను విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి, భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి.
No comments:
Post a Comment